లే...ఇంకా రెడీ కాలేదా....ముందు లే... ఎంటే నీ బాధ....కాసేపు పడుకొనివ్వు...కనీసం పుట్టిన రోజున కూడా పడుకొనివ్వవ..నన్ను.... అబ్బా....లేరా....కావాలంటే రెడీ అయ్యి పడుకో... అని దుప్పటీ లో దూరిన సిద్దు నీ బలవంతంగా బెడ్ మీద నుంచి కిందికి లాగుతుంది.... అసలు జాలి లేదు నికు... పోవే అని అంటూ వెళ్తాడు సిద్దు.... ......  అద్దం లో చూసుకుంటూ వున్న కీర్తి వంక చూస్తూ... చూడు నువ్వు రెడీ అయితే ఎంత అందం గా ఉన్నవో.....ఎప్పుడు చూడు...ఆ మాసిపోయిన నైటీ వేసుకొని వుంటావు....అయిన నైటీ అంటే నైట్ వేసుకోవాలి యిల రోజంతా కాదు... చా....మరీ మీరు ఎందుకు షార్ట్ లు వేసుకొని ఫంక్షన్ లకు కూడా వెళతారు.... నీతో ఇదే బాధ....అన్నింటికీ లింక్ లు పెడతావు .. పిల్లలు ఎరి ... పడుకున్నారు....త్వరగా రెడీ అవ్వు.... అవుతలే...కానీ నువ్వు ఇలా రెడీ అయితే ఎంత బాగున్నావు తెలుసా ....ఆ కాటుక కల్లని చూసే నేను పడిపోయా....మళ్లీ ఇన్ని రోజులకు చూసా .... అని కీర్తి కళ్ళలోకి చూస్తూ అంటాడు...  చాలు లే పైకి పదా... ఇప్పుడే పై కి పొమ్మని అంటావా... చి....పుట్టిన రోజున ఎం మాటలు రా...టెర్రస్ పై కి పా... ఎందుకు.... ముందు నువ్వు పదా.... హ్యాపీ బర్త్ డే రా....అని గట్టిగ అరుపులు....సిద్దు నీ చూడగానే...తన స్కూల్ ఫ్రెండ్స్....కాలేజి ఫ్రెండ్స్...గల్లి ఫ్రెండ్స్....అందరినీ ఒక్క చోట ... చూసిన సిద్దు కి ఎం అర్థం కాలేదు...  వాళ్ళ అందరితో మాట్లాడుతూ....నవ్వుతూ వుంటే.. ఇన్నేళ్లుగా లేని ఒక ఆనందం తన మొహం లో కనబడుతుంది...పార్టీ చాలా బాగా జరిగింది....ఫ్రెండ్స్ అందరు ఒక్క దగ్గర కలిసే సరికి అస్సలు టైమ్ తెలియలేదు.... అందరూ టెర్రస్ పై కూర్చొని గుంపులు గుంపులుగా మాట్లాడు కుంటున్నారు...సిద్దు తన పిల్లలని అందరికీ పరిచయం చేస్తూ విల్లు అంకుల్స్ విల్లు అంటిస్ అని వాళ్ళని అట పట్టిస్తు వున్నాడు... అప్పటి వరకు వస్తున్న మ్యూజిక్ ఆగి పోయింది.... అందరూ గొంతు సవరించుకుంటూ మైకే పట్టుకొని వున్న కీర్తి వంక చూస్తున్నారు... పిలవగానే వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ చాలా థాంక్స్....వన్స్ ఆగిన్ హ్యాపీ బర్త్ డే సిద్ధూ... సిద్దు గురించి నా గురించి మీ అందరికీ తెలిసిందే ...ప్రేమ ...పెళ్లి....అన్ని... కానీ మీ అందరికీ తెలియని సిద్దు గురించి మీతో ఒక రెండు నిమిషాలు చెప్తాను.... అందరూ....ప్రతి మగవడి విజయం వెనుక ఒక ఆడది వుంటుంది అని అంటారు..అది ఎంత వరకు నిజం అని తెలియదు....కానీ....నా విజయం వెనుక మాత్రం....ఒక అబ్బాయి వున్నాడు....తను సిద్దు... అవును...అందరూ అనుకుంటారు...పెళ్లి అయ్యాక ఎం లైఫ్ వుంటుంది...ఎం వుండదు...ఇల్లు పని పిల్లలు అంతే అని...కానీ అసలు అయిన లైఫ్ పెళ్లి అయ్యాకే... యస్... పెళ్లి అయ్యాకే ఇబ్బందులు ఎదరు అవుతాయి...కష్టాలు వస్తాయి...అప్పుడే నిజం అయిన ప్రేమ బయటకి వస్తుంది... మీ అందరికీ తెలిసిందే చిన్న వయసులో మేము పెళ్లి చేసుకున్నాం...అప్పుడు ఇంకా ఇద్దరి చదువులు పూర్తి కాలేదు....ఫ్యామిలీ సపోర్ట్ లేదు... ఎకానిమికల్ సపోర్ట్ లేదు.... ఆ టైమ్ లో ఒకరికి మాత్రమే చదివే అవకాశం ఉంది...అప్పుడు తన ఫ్యూచర్ నీ గోల్స్ నీ వదిలి నా కోసం వర్క్ కి వెళ్తూ నన్ను చదివించాడు...ఫలితం ఇప్పుడు నాకు వచ్చిన జాబ్.... ఇందులో ఎం వుంది అని అనుకోవచ్చు....చాలా వుంది....ఫ్రెండ్ మాతో తినవచ్చు గా అని బ్రతిమి లాడిన...తనకోసం వెయిట్ చేసే బార్య గుర్తు వచ్చి...అరేయ్ నేను తిని వచ్చారా...మీరు కానివ్వండి అని చెప్పడం లో ఎంత బాధ ఎంత సంతోషం వుంటుంది కేవలం వాళ్ళకే తెలుసు... తన వయసు వాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తూ వుంటే తను అవి పట్టించు కోకుండ వర్క్ ఫ్యామిలీ ...ఇట్స్ వెరీ పెయిన్...ఒక అమ్మాయి కి పెళ్లి అయ్యాక చదువు అంటే చాలా కష్టం....చదువు అవసరమా ఇంట్లో వుండి పనులు చేసుకోక ...చదివి ఎం ఉద్ధరించలి....కాలేజి కి వెళ్తే పనులు ఎవరు చేస్తారు...అన్ని ప్రశ్నలకు సమాధానం తానే చెప్పి....నా ఇష్టం నీ...నా గోల్స్ నీ...నేను అందుకోవడం కోసం తను నిచ్చన గా మారి నన్ను గెలిపించి తను ఒడిపోతువున్న ఆ బాధ నీ బయట పడ నివ్వలేదు... ఇప్పుడు కూడా చాలా మంది...పెళ్ళాం నీ పనికి పంపుతున్న డు తనకు సేవలు చేస్తున్నాడు అని హేళన చేస్తున్నారు....ఏ పనికి వెళితే తప్పు ఎం వుంది...నేను షాప్ లో వుండి తను పనికి వెళితే తప్పు లేనపుడు...తను షాప్ లో వుండి నేను పనికి వెళితే తప్పు ఎం వుంది...మా మనసుకి నచ్చిన పనిని మేము సంతోషం గా పంచుకుంటున్న...చూసే వారికి ఎందుకు బాధా...నన్ను చదివించకుండ తను చదువు కొని వుంటే ఇంకా పెద్ద ఉద్యోగం వచ్చేది తనకు....కానీ తను తనకు ఎదురు అయ్యే మాటల గురించి కాక నా జీవితం గురించి ఆలోచించాడు... ఇవి మాత్రమే కాదు ఒక అమ్మాయి విషయం లో ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్....అవి దాటడానికి తనకు ఒక స్టిక్ చాలా అవసరం... యస్ ఒక అమ్మాయి సక్సెస్ ఫుల్ ఊమెన్ కావాలి అంటే తనకు ఒక స్టిక్ చాలా అవసరం...స్టిక్ అని చెప్పే కంటే ఒక కామ్రేడ్ కావాలి...తను నా లైఫ్ లో నా సిద్ధూ....అని కంట్లో వస్తున్న కన్నిలను ఆపుకుంటూ చిరు నవ్వు తో సిద్దు వంక చూస్తుంది...సిద్దు వచ్చి గట్టిగ హగ్ చేసుకొని నుదుటి పై ముద్దు ఇస్తాడు...  కీర్తి కళ్ళు మూసుకుని తన గతం నీ ఒక్క క్షణం గుర్తు చేసుకుంటుంది...ఆర్ట్స్ కాంపిటీషన్ లో సెక్సవాల్ హర్శ్మెంట్ కి లోనయి తన కెరియర్ కి పుల్స్తప్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ధైర్యము చెప్పి ఆఫీసర్ నీ ఎదిరిచడం...పెళ్లి చేయమని అడిగితే ఒక రాత్రి వుండమని అడిగిన రిజిస్టర్ ఆఫీసర్ నీ ఎదురించడం.....పెళ్లి అయ్యాక చదువు అవసరమా అని అంటూ వుంటే...అవసరమే అని వాదించి కాలేజ్ లో జాయిన్ చెయ్యడం....పడుకున్న తనను కాఫీ పెట్టీ లేపి చదువు కోమని చెప్పడం....వర్క్ లో హెల్ప్ చేస్తూ...ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయటం....ఇంకా ఎన్నో గుర్తు చేసుకుంటూ సిద్దు కళ్ళలోకి ప్రేమ గా చూస్తోంది...స్నేహితుల చప్పట్ల శబ్ధం లో....
No comments:
Post a Comment